ఎన్నికల క్యాండెట్ ల విషయం లో బీబత్సమైన క్లారిటీతో ఉన్న జగన్..!

Written By Xappie Desk | Updated: March 01, 2019 10:47 IST
ఎన్నికల క్యాండెట్ ల విషయం లో బీబత్సమైన క్లారిటీతో ఉన్న జగన్..!

ఎన్నికల క్యాండెట్ ల విషయం లో బీబత్సమైన క్లారిటీతో ఉన్న జగన్..! ప్రజా సంకల్ప పాదయాత్ర తో వైసిపి పార్టీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ గ్రాఫ్ అమాంతం పెంచేశారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో తమ పార్టీ అభ్యర్థుల విషయంలో అధికార పార్టీ టీడీపీ మరియు వైసీపీ పార్టీలు అభ్యర్థుల ఖరారు లను నువ్వా నేనా అన్నట్టుగా చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని చోట్ల అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఫుల్ క్లారిటీ తో ఉండగా మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న వైసిపి కూడా టీడీపీకి కంటే ఒక్కడుగు ముందడుగు లోనే ఉంది.
 
ఈ క్రమంలో ఇటీవల కొన్ని జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. ఇదే క్రమంలో వైసీపీ అధినేత జగన్ కూడా తాజాగా ఒక అడుగు ముందుకు వేస్తూ అభ్యర్థుల ఎంపిక విషయంలో జోరు పెంచుతున్నాడు. రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగబోయే అభ్యర్ధులని వీలైనంత త్వరగా ప్రకటించేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయి రాబోయే రాజకీయ పరిణామాల గురించి చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మొత్తం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇటీవల స్పష్టం చేశారు. మరిముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే బస్సు యాత్ర కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.
Top