పాకిస్తాన్ పై సంచలన కామెంట్స్ చేసిన సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ..!

Written By Xappie Desk | Updated: March 01, 2019 10:59 IST
పాకిస్తాన్ పై సంచలన కామెంట్స్ చేసిన సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ..!

పాకిస్తాన్ పై సంచలన కామెంట్స్ చేసిన సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ..!
 
గతంలో వైసీపీ అధినేత జగన్ కేసుల్లో కీలకంగా వ్యవహరించిన మాజీ సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా పాకిస్థాన్ ఆర్మీ భారత్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఈ క్రమంలో ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ భారత జవాన్ అభినందన్ ను పట్టుకున్న విషయంపై ఆసక్తికరమైన కామెంట్ చేశారు జేడీ లక్ష్మీనారాయణ. జెనీవా ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ ప్రభుత్వం వారు అభినందన్ ను భారత్ కు తప్పక తిరిగి పంపించాల్సిందే అని తెలిపారు. భారత్ మరియు పాకిస్థాన్ ల మధ్య 1948 కాలం నుంచే ఇలాంటి యుద్ధాలు జరిగినపుడు పాకిస్థాన్ వారికి భారత్ తో నేరుగా యుద్ధం చేసి గెలిచే అవకాశం లేదని వారు అర్ధం చేసుకున్నారని అందుకే అప్పటి నుంచి ఇలా యుద్ధాల్లో ఎవరైనా దొరికినపుడు వారిని మభ్యపెట్టి ట్రైనింగ్ ఇచ్చి భారతదేశంలో కల్లోలాలు సృష్టించడానికి పంపిస్తారని అన్నారు.
 
భారతదేశం ఏనాడు ఏ దేశంపైనా దాడులు చెయ్యలేదని అలాగే ముందు పాకిస్థాన్ వారు పుల్వామాలో దాడి చేస్తే వారిపై ప్రతిచర్యగా వారి స్థావరాలపై దాడి చేసారు కానీ కావాలని ఏ దేశం పైన దాడి చేసే దేశం భారతదేశం కాదని తెలిపారు. ఏదిఏమైనా భవిష్యత్తులో ఎప్పుడైనా భారత్ మరియు పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం గాని వస్తే కచ్చితంగా భారత్ బలమైన దెబ్బ కొట్టడం ఖాయమని ఆ దెబ్బకి ప్రపంచపటంలో పాకిస్తాన్ దేశం ఉండకపోయినా ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమీ కాదని గర్వంగా చెప్పారు జేడీ లక్ష్మీనారాయణ.
Top