రాబోయే ఎలక్షన్ల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!

Advertisement

by Xappie Desk | March 01, 2019 11:06 IST
Follow Xappie
రాబోయే ఎలక్షన్ల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!

రాబోయే ఎలక్షన్ల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!
 
గత సార్వత్రిక ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్ రానున్న ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజధాని ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకుని అందరి దృష్టిని ఆకర్షించిన జగన్ తాజాగా ఇటీవల రాష్ట్రంలో తాను నియమించిన అన్ని నియోజకవర్గాల ఇన్చార్జ్లతో కార్యకర్తలతో భేటీ అయ్యారు. తాజాగా జరిగిన ఈ సమావేశంలో రాబోయే ఎలక్షన్లలో కోసం నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి క్షేత్ర‌స్థాయిలో ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా వారి నుండి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించ‌డ గ‌మానార్హం. కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువ‌డునున్న సంగ‌తి తెలిసిందే.
 
దీంతో నోటిఫికేష‌న్ రాగానే బ‌స్సుయాత్ర ప్రారంభిస్తాన‌ని జ‌గ‌న్ తెలిపారు. అందులో భాగంగా వైసీపీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాన్ని కాపీ కొడుతున్న చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని జ‌గ‌న్ అన్నారు. దీంతో వైసీపీ నేత‌లు,కార్య‌క‌ర్త‌లు టీడీపీ చేస్తున్న మోసాల‌ను క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాల‌ని, ఈ క్ర‌మంలో అన్ని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కొత్త ప‌రిశీల‌కుల‌ను జ‌గ‌న్ నియ‌మించారు. అలాగే ప్ర‌తి రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్ల‌కు ఒక ప‌రిశీల‌కుని నియ‌మించారు జ‌గ‌న్. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రు నిత్యం ప్ర‌జా క్షేత్రంలోనే ఉండాని ఈ స‌మావేశంలో భాగంగా జ‌గ‌న్ తేల్చి చెప్పారు. మొత్తంమీద జగన్ రానున్న ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని నియోజకవర్గంలో ఉన్న ప్రతి పార్టీ నాయకుడిని మరియు కార్యకర్తని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.


Advertisement


Advertisement

Top