ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ చూసి షాక్ తిన్న చంద్రబాబు..!
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తున్న క్రమంలో గత నాలుగు నెలల నుండి రాష్ట్రంలో సర్వేల గోల మొదలైంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సర్వేలో మరియు జాతీయ సర్వే లో వైసిపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఫలితాలు రావడంతో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తమయ్యారు. దీంతో తాజాగా అనేక చోట్ల భారీ బహిరంగ సభలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు సంచలన హామీలు ప్రకటిస్తూ ఎలాగైనా మరొకసారి అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. అయితే హామీలు ప్రకటించిన తరువాత రాష్ట్రంలో చంద్రబాబు లో ప్రముఖ సర్వే సంస్థకు...సర్వే చేయండంటూ ఓ జాతీయ ఛానల్‌కు, ఇంటెలిజెన్స్ బ్యూరోకు బాధ్యతను అప్పగించారని టాక్.
ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే నివేదికలు చంద్రబాబు టెబుల్ మీదకు చేరాయని సమాచారం. వాటిని చూసి బాబుకు షాక్ కొట్టినంత పనైందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 175కు గాను 95 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్‌సీపీ జెండా ఎగరేయడం ఖాయమని నివేదిక సారాంశం. టీడీపీ 48 సీట్లకే పరిమితమవుతోందని నివేదిక తెలిపింది. దీనిని బట్టి అధికారంలోకి చేపట్టడానికి కావాల్సిన 88 సీట్ల కంటే 7 సీట్లు ఎక్కువగానే వైఎస్ఆర్‌సీపీ సొంతం చేసుకుంటుంది. టీడీపీకి అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇక రాయలసీమలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందట. మరి అదేవిధంగా అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో టీడీపీకి కొంచెం పట్టు ఉన్నట్టు మరియు ఉభయ గోదావరి జిల్లాలలో మాత్రం పవన్ కళ్యాణ్ కొంత ప్రభావితం చేయబోతున్నట్లు ఈ సర్వేలో తేలింది.