రాష్ట్రంపై మోడీ కుట్ర పన్నాడు అని సంచలన కామెంట్లు చేసిన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: March 02, 2019 14:26 IST
రాష్ట్రంపై మోడీ కుట్ర పన్నాడు అని సంచలన కామెంట్లు చేసిన చంద్రబాబు..!

రాష్ట్రంపై మోడీ కుట్ర పన్నాడు అని సంచలన కామెంట్లు చేసిన చంద్రబాబు..!
 
విశాఖపట్టణం లో పర్యటించిన ప్రధాని మోడీ పర్యటన ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కుట్రలో భాగంగా ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారని పేర్కొన్నారు. దారుణంగా రాష్ట్రాన్ని మోసం చేసిన ప్రధాని మోడీ కి గట్టిగా నిరసన సెగలు చేపట్టాలని టీడీపీ నేతలకు సూచించిన చంద్రబాబు..ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ ఒక మాయ జోన్ అని ఆయన అన్నారు. బిజెపి ఇందుకు మూల్యం చెల్లిస్తుందని ఆయన హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా చంద్రబాబు వాడుతున్నారు.
 
రెండేళ్ల క్రితమే యుద్దం వస్తుందని చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారని, అది బిజెపి దుర్మారపు రాజకీయం అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల మోసం చేసి ఇప్పుడు ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించడం చాలా సిగ్గుచేటు అంటూ ప్రజలంతా గమనిస్తున్నారని మరికొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగిన విధంగా ప్రజలు బుద్ధి చెబుతారని అంటున్నారు. ఎలక్షన్ల కోసం మోడీ చేస్తున్న హామీలు మరియు గత నాలుగు సంవత్సరాలు రైల్వే జోన్ కోసం తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ధర్నాలు మరియు నిరసనలు ప్రజలంతా గమనించారని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే పట్టం కడుతున్నారని టిడిపి నాయకులు కామెంట్లు చేస్తున్నారు.
Top