అభినందన్ విషయంలో మోడీ కి దేశంలో ఎవరు వెయ్యని కౌంటర్లు వేసిన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: March 02, 2019 14:29 IST
అభినందన్ విషయంలో మోడీ కి దేశంలో ఎవరు వెయ్యని కౌంటర్లు వేసిన చంద్రబాబు..!

అభినందన్ విషయంలో మోడీ కి దేశంలో ఎవరు వెయ్యని కౌంటర్లు వేసిన చంద్రబాబు..!
 
ఇటీవల భారత్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన జవాన్ అభినందన్ ను పాకిస్తాన్ ప్రభుత్వం తమ భూభాగంలో పట్టుకున్న విషయం మనకందరికీ తెలిసినదే. దేశవ్యాప్తంగా సంచలనం అయిన ఈ విషయంపై చాలా మంది జాతీయ రాజకీయ నాయకులు వివిధ రకాలుగా కామెంట్లు చేసి ఆర్మీ జవాన్ సురక్షితంగా దేశానికి రావాలని కోరుకున్నారు. ఇదే క్రమంలో దేశ ప్రజలంతా కూడా అభినందన్ సురక్షితంగా భారత్ కు చేరాలని తమతమ దేవుళ్లను మొక్కుకున్నారు. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య పెద్ద వాతావరణం నెలకొంది. అయితే ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రభుత్వం జవాన్ అభినందన్ ను విడిచిపెట్టింది.
 
ఈ క్రమంలో ప్రధాని మోడీ ఎలక్షన్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడం చాలా సిగ్గుచేటు అంటూ దేశాన్ని కాపాడటం కోసం శత్రు దేశం తో పోరాడిన అభినందన్ ను సాదరంగా ఆహ్వానించాల్సిన విషయం మర్చిపోయి అధికారం కోసం నీచ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారని తీవ్రస్థాయిలో ఎవరు వేయని కౌంటర్లు మోడీ పై వేశారు చంద్రబాబు. ఎవరైనా విదేశీ నాయకుల కొడుకులు మరియు ఇతర కుటుంబ సభ్యులు వస్తే సాదరంగా ఆహ్వానించే మోడీ దేశం కోసం శత్రు దేశాల తో పోరాడిన జవాన్ కి ఆహ్వానం పలకక పోవటం నిజంగా సిగ్గు చేటు అంటూ చంద్రబాబు దారుణంగా కామెంట్లు చేశారు.
Top