పాకిస్తాన్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి సంచలన కథనం..!
త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో పార్టీని పటిష్ట పరుస్తూ మరోపక్క నాయకులను రెడీ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రజలకు భరోసా ఇస్తూ భారీ బహిరంగ సభలో పాల్గొంటూ తాజా రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్లు మరియు కామెంట్లు చేస్తూ ఆంధ్ర రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ సభలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భారత శత్రు దేశమైన పాకిస్థాన్ మీడియా లో సంచలన కథనాలు ప్రసారమవుతున్నాయి.
రాయలసీమ ప్రాంతంలో ఇటీవల పర్యటించిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల ముందే భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్లు తనకు సమాచారం వచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీంతో ఇదే అంశాన్ని ఉటంకిస్తూ పాకిస్థాన్ జాతీయ పత్రిక డాన్‌లో కీలక కథనాన్ని ప్రచురించి జనసేనా అధినేత పవన్‌కల్యాణ్ పేరుని మెన్షన్ చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై జాతీయ మీడియా కూడా ఓవర్‌గా స్పందిస్తుండటంతో జనసేనాని రంగంలోకి దిగారు. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ అన్న మాటల్ని, పేపర్లలో వచ్చిన వార్తా కథనాల్ని ఉదాహరణగా చూపిస్తూ మాట్లాడానే కానీ తానకు స్వయంగా సమాచారం వుందని మాత్రం ఎక్కడా చెప్పలేదని, ఇలాంటి సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయెద్దని, దేశంలో కలకాలం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు పవన్.