జగన్ తన కలలో మాత్రమే ముఖ్యమంత్రి బయట చాన్స్ లేదు : శివాజీ

Written By Xappie Desk | Updated: March 02, 2019 14:35 IST
జగన్ తన కలలో మాత్రమే ముఖ్యమంత్రి బయట చాన్స్ లేదు : శివాజీ

జగన్ తన కలలో మాత్రమే ముఖ్యమంత్రి బయట చాన్స్ లేదు : శివాజీ
 
ఆపరేషన్ గరుడ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య చాలా జరుగుతాయని ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై దాడి జరుగుతుందని విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్ పై దాడి జరగక ముందే ప్రకటించారు ఆపరేషన్ గరుడ సృష్టికర్త శివాజీ. గతంలో ప్రత్యేక హోదా సాధన సమితి లో కీలకంగా వ్యవహరించిన శివాజీ ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వం పై సంచలన కామెంట్ లు చేస్తూ ఏపీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.
 
ఈ క్రమంలో ఇటీవలఓ కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ పార్టీ జగన్ చాలా డ్రామాలు ఆడుతున్నారని కామెంట్లు చేశాడు. ప్ర‌ధాని నరేంద్ర‌మోదీకి జ‌గ‌న్‌కు లింక్ పెడుతూ.. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో వైసీపీ మోదీని ఎందుకు ప్ర‌శ్నించ‌డంలేద‌ని శివాజీ అడిగారు. సోష‌ల్ మీడియాలో వెబ్‌సైట్‌ల‌లో దాదాపు 70 శాతం వైసీపీవేన‌ని శివాజీ తెలిపారు. ఇటీవ‌ల కేంద్రం ప్ర‌క‌టించిన విశాఖ జోన్ పై మాట్లాడుతూ.. వేరుశెన‌గ‌కాయ పంట పండింది కానీ, దానిలో విత్త‌నాలు లేవ‌ని శివాజీ సెటైర్ వేశారు. మోదీకి మిత్రులు ఎవ‌రైనా త‌మ‌కు శ‌త్రువుల‌ని శివాజీ స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని..అంటూ జ‌గన్ సీయం ఆశ‌లు నెర‌వేర‌వ‌ని, జ‌గ‌న్ కోరిక క‌ల‌గానే మిగిలిపోతుంద‌ని శివాజీ తేల్చి చెప్పారు.
Top