వరల్డ్ వైడ్ లోనే ఆర్మీ జవాన్ అభినందన్ కు ఓ ప్రత్యేకత ఉంది..!

Written By Aravind Peesapati | Updated: March 04, 2019 11:23 IST
వరల్డ్ వైడ్ లోనే ఆర్మీ జవాన్ అభినందన్ కు ఓ ప్రత్యేకత ఉంది..!

భారత్ శత్రు దేశమైన పాకిస్తాన్ దేశం లోకి వెళ్లి వణుకు పుట్టించిన మన ఆర్మీ జవాన్ అభినందన్ పేరు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మారుమ్రోగుతోంది. అభినందన్ కి ఉన్న దేశభక్తి మరియు వీరత్వం గురించి దేశంలో చాలామంది ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ అతనిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాక్ చేతిలో పట్టుబడిన గాని అభినందన్ ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉండగా పాక్ సైన్యానికి అభినందన్ పట్టుబడక ముందు అభినందన్ చేసిన చర్య ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. విషయం ఏమిటంటే కాలం చెల్లిన మిగ్ యుద్ధ విమానంతో.. అత్యంత శక్తివంతమైన ఎఫ్ -16 యుద్ధ విమానాన్ని కూల్చివేయటం మామూలు విషయం కాదంటున్నారు. అభినందన్ యుద్ధ విమానం కూలే సమయానికి ముందు.. పాక్ కు చెందిన ఎఫ్-16 యద్ద విమానాన్ని కూల్చేసిన విషయాన్ని తాజాగా గుర్తించారు. ఉంటే.. చరిత్రలో ఎఫ్ -16ను కూల్చిన ఘటనలు ఇప్పటివరకూ చోటు చేసుకోలేదు. ఆ ఘనత సాధించిన దేశంగా భారత్ ఇప్పుడు సాధించింది. అంతేకాకుండా ఎఫ్ -16 యుద్ధ విమానాన్ని కూల్చటం ద్వారా ప్రపంచ దేశాల్లో అభినందన్ హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకంటే.. అభినందన్ వెళ్లింది పాతకాలపు మిగ్ -21 బైసన్ లో. ఆయన ఎదుర్కొంది ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానం. అలాంటిది రష్యాకు చెందిన పాతతరం యుద్ధ విమానంతో అత్యాధునిక అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేయటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
Top