రాజధాని ప్రాంతంలో నుండి పోటీ చేయాలనుకుంటున్న జగన్?

Written By Aravind Peesapati | Updated: March 04, 2019 11:30 IST
రాజధాని ప్రాంతంలో నుండి పోటీ చేయాలనుకుంటున్న జగన్?

వైయస్ కుటుంబానికి కడప జిల్లాలో ఎదురులేదని రెండు తెలుగు రాష్ట్రాలలో తల పండిపోయిన సీనియర్ రాజకీయ నేతలు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు కామెంట్లు చేస్తుంటారు . రెండు మూలంగానే కడప జిల్లాలో ఎక్కడి నుండి ఆ కుటుంబం పోటీ చేసిన గెలుపు తధ్యమని ఆ కుటుంబం బయట నుండి పోటీ చేయలేదని కూడా విమర్శలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగానే పులివెందుల నుండి పోటీ చేస్తూ ఇదే క్రమంలో రాజధాని పరిసర ప్రాంతమైన గుడివాడ నియోజకవర్గం నుండి కూడా పోటీకి దిగాలని భావిస్తున్నట్లు వైసీపీ పార్టీ నుండి వస్తున్న సమాచారం. ప్రస్తుతం తన పార్టీ తరఫున పోటీకి దిగబోయే అభ్యర్థుల విషయంలో బిజీగా ఉన్న జగన్ త్వరలోనే బస్సుయాత్ర చేపట్టబోతున్నట్లు ఈ విషయాన్ని ఆ యాత్రలో ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. గుడివాడలో ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొడాలి నాని ఉన్నారు. కొడాలి నానికి జ‌గ‌న్ అంటె ఎంత అభిమాన‌మో అంద‌రికి తెల‌సిందే. జ‌గ‌న్ కోసం సీటు త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నారు. కడప జిల్లాతో పాటు రాజధాని ప్రాంతంలో కూడా సత్తా చాటాలని జగన్ ప్రయత్నిస్తున్న సమయంలో గుడివాడలో పోటీ లాభిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనిలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయితే మరోపక్క గుడివాడ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ ని బరిలోకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Top