మంచి ఫైర్ మీద ఉన్న పవన్ కళ్యాణ్… టార్గెట్ బిజెపి..!

మంచి ఫైర్ మీద ఉన్న పవన్ కళ్యాణ్… టార్గెట్ బిజెపి..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజా రాజకీయాల గురించి రాయలసీమ ప్రాంతంలో చేస్తున్న ప్రసంగాలు మరియు ప్రజలనుద్దేశించి ఇస్తున్న హామీలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ఇటీవల పాకిస్తాన్ మరియు భారత దేశాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలను ఉద్దేశించి తనకు యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే తెలుసు అని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు గురించి బీజేపీ నేతలు దారుణంగా విమర్శలు చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్లు వేసాడు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బిజెపి పార్టీ నాయకులు పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదని, పీకే అంటే పాకిస్థాన్ అని విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ తన దేశభక్తిని పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తన దేశభక్తి స్థాయి ఏంటో తెలియాలంటే ప్రధాని మోడీని అడగండని బదులిచ్చారు. అంతేకాకుండా మోడీతో కలిసి దిగినటువంటి ఫోటోలను పోస్ట్ చేస్తూ, మోడీ కామెంట్స్ ని ని కూడా పోస్ట్ చేశాడు. పవన్ నిబద్ధతకు తాను ముగ్ధుడనయ్యానంటూ మోడీ అన్నట్లు ఉన్న ఓ న్యూస్ క్లిప్పింగ్ ని సైతం జతచేశారు. గతంలో కలిసిన చంద్రబాబు, పవన్, మోడీలు తరువాత జరిగినటువంటి కొన్ని పరిణామాల కారణంగా వారందరు కూడా విసిపోయారు. అయితే ఈ విషయం మీద కూడా కొందరు నెటిజెన్స్ పవన్ ని ప్రశ్నించగా, దాని పై కూడా పవన్ చాలా సానుకూలంగానే స్పందించాడని సమాచారం.Top