డేటా లీకేజ్ కేస్ ఏపీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులు..!

Advertisement

by Xappie Desk | March 05, 2019 11:41 IST
Follow Xappie
డేటా లీకేజ్ కేస్ ఏపీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులు..!

డేటా లీకేజ్ కేస్ ఏపీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులు..!
 
రెండు తెలుగు రాష్ట్రాలు అయినా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా లీకేజ్ వ్యవహారం కలకలం రేపుతోంది. సామాన్య పౌరుడు వ్యక్తిగత మరియు ప్రభుత్వ పరమైన సంబంధించిన వివరాలను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయడంతో దేశద్రోహం కేసు అవుతుందని చాలా మంది సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రజల వ్యక్తిగత మరియు ప్రభుత్వ పరమైన సమాచారాన్ని ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కి కొన్ని లిటిగేషన్ ల పేరిట ఇవ్వడంతో ఇప్పుడు ఈ కేసు సంచలనం అయ్యింది దేశవ్యాప్తంగా. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తెలుగుదేశం మరియు టీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ కేసు గురించి మాటల తోటలు పెరుగుతున్నాయి.
 
ఈ క్రమంలో తెలంగాణా పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇంతకి విషయం ఏమిటంటే ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం బయటకు వెళుతుందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే లోకేశ్వర్ రెడ్డి వద్దకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసులు కొంతమంది వచ్చి తనని బెదిరించారని, అంతే కాకుండా తన ఇంటికి వచ్చి తనని బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని సంచలన నిజాలు బయటపెట్టారు. దీనితో వీరి పైన కూడా తెలంగాణ పోలీసులకు లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చెయ్యగా వారు ఏపీ పోలీసులపై కేసు పెట్టారు. వారి అనుమతి లేకుండా డేటా గ్రిడ్ కేసులో ప్రధాన సాక్ష్యం గా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకి వచ్చి ఎలా బలవంతంగా తీసుకెల్దామని చూస్తారని... ఇందుకు కారణమైన ప్రతీ ఒక్క ఏపీ పోలీసు కూడా విచారణకు రావాల్సిందే అని తెలంగాణ పోలీసులు తెలుపుతున్నారు.


Advertisement


Advertisement

Top