జగన్ కి తవ్విన గోతిలో వారే పడ్డారు..!

Written By Xappie Desk | Updated: March 05, 2019 11:48 IST
జగన్ కి తవ్విన గోతిలో వారే పడ్డారు..!

జగన్ కి తవ్విన గోతిలో వారే పడ్డారు..!
 
గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ నుండి గెలిచిన చాలామంది నేతలు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడంతో చట్టసభలలో చాలా పోరాటాలు చేసిన జగన్ కి సరైన మద్దతు ఎటు వైపు నుండి కూడా రాలేదు. దీంతో ప్రజల ని నమ్ముకుని పోరాటాలు చేశాడు జగన్. అయితే తన ప్రత్యర్థి పార్టీ వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి వచ్చిన నేతలకు తాజాగా ఎన్నికలు వస్తున్న క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ల ఆంటీల విషయంలో వైసీపీ పార్టీ కి చెందిన ఫిరాయింపు నేతలను కరివేపాకులా తీసేశారు అని ఏపీ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది.
 
వైసీపీకి చెందిన చాలా మంది నేతలు దాదాపు టికెట్లు ఖరారు కాకుండా చంద్రబాబు ఎత్తుగడలు వేయడం తో వీళ్లంతా ఎవరికి తమ బాధ చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జ‌గ‌న్ చ‌రిష్మాతో గెలిచిన వాల్లు. అందుకే ఈ సారి వారికి టికెట్ ఇస్తే జనాలు ఛీకొట్టే అవకాశం ఉండ‌టంతో బాబు టికెట‌క్లు ఇవ్వ‌కుండా నిరాక‌రించిన‌ట్లు స‌మాచారం. బుబు వెన్నుపోటును బ‌య‌ట‌కు చెప్పుకోలేక పోతున్నారు. ఎందుకంటె… పార్టీ ఫిరాయించే స‌మ‌యంలో వాళ్ల‌కు అందిన ప్యాకేజీలు ఎక్క‌డ బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో క‌క్క‌లేక మింగ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారంట‌. మొత్తమ్మీద ఈ పరిణామాన్ని చూస్తుంటే జగన్ కి తవ్విన గోతిలో వీళ్లు పడ్డారని సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు.
Top