తెలుగుదేశం పార్టీ కి కొత్త పేరు ప్రకటించిన వైసీపీ పార్టీ..!

Advertisement

by Xappie Desk | March 05, 2019 11:57 IST
Follow Xappie
తెలుగుదేశం పార్టీ కి కొత్త పేరు ప్రకటించిన వైసీపీ పార్టీ..!

తెలుగుదేశం పార్టీ కి కొత్త పేరు ప్రకటించిన వైసీపీ పార్టీ..!
 
రాష్ట్ర పౌరుల వ్యక్తిగత సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాల్సిన విషయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రైవేటు సంస్థ అయిన ఐటీ గ్రిడ్‌కు అప్పగించడంతో ఈ విషయం బయటకు రావడంతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కేంద్రంగా మొత్తం తతంగం జరగడంతో ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదాస్పదంగా మారింది.
 
ఐటీ గ్రిడ్ స్కాంపై రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. వైసీపీ సానుభూతి ప‌రుల ఓట్ల తొల‌గింపుకోస‌మే ఇదంతా టీడీపీ ప్ర‌భుత్వం చేయిస్తోంద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ అంటే ‘తెలుగు డేటా దొంగల పార్టీ’ అని మ‌రో కొత్త నిర్వ‌చ‌నం ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఉండాల్సిన డేటా బయటకు ఎలా వెళ్లిందని ప్ర‌శ్నించారు. సర్వేల పేరుతో ఓటర్ల సమాచారం సేకరించారని తెలిపారు. ఓటర్లను నాలుగు భాగాలుగా విభజించి ఓట్ల తొలగింపు చేపట్టారని, ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేని వారి ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు.


Advertisement


Advertisement

Top