టీడీపీ కంచుకోట బద్దలు అయ్యేటట్టు సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!

Written By Xappie Desk | Updated: March 06, 2019 11:40 IST
టీడీపీ కంచుకోట బద్దలు అయ్యేటట్టు సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!

టీడీపీ కంచుకోట బద్దలు అయ్యేటట్టు సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా లీకేజ్ వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని అన్ని సర్వేలలో అధికారంలోకి వస్తుంది వైసిపి పార్టీ అని తేలడంతో వైసీపీ పార్టీ వాటిని తొలగించే కార్యక్రమానికి చాలా తెలివిగా ప్రైవేటు సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత మరియు ప్రభుత్వ పరమైన సమాచారాన్ని అందించడం తో ఈ విషయం బయటకు రావడంతో డేటా లీకేజ్ వ్యవహారం పెద్ద కేసు గా మారింది.
 
తాజాగా ఈ ఘటన బయటపడటంతో టీడీపీ నేత‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డుతున్నారు. క్రాస్ బుకింగ్ ప‌రంగా 30 కోట్లుకు బ్లూఫ్రాగ్ సంస్థ‌కు డీల్ ఇచ్చారు. ఆధార్ కేసు ప‌రంగా వ్య‌క్తిగ‌త గోప్య‌త‌ను ఇది ఉల్లంఘించ‌డం కాదా..పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం బయట వ్యక్తులకు ఇవ్వటాన్ని జాతీయ స్థాయిలో ఉన్న చాలామంది రాజకీయ నేతలు ప్రముఖులు తప్పు పడుతున్నారు. ఇదే క్రమంలో వైసిపి పార్టీ మద్దతుదారుల ఓటర్లను ఓటర్ల లిస్టు నుండి తొలగించడానికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నించడంతో ఈ వ్యవహారంపై థ‌ర్డ్‌పార్టీతో విచార‌ణ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ క్ర‌మంలో గ‌తంలోనే ఎన్నిక‌ల సంఘానికి జ‌గ‌న్ ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇక మ‌రోవైపు తెలంగాణ పోలీసుల‌కు కూడా ఫిర్యాదు ఇవ్వ‌డంతో రంగ‌లోకి దిగిన పోలీసులు తీగ లాగ‌డంతో డొంక మొత్తం క‌దులుతోంది. దీంతో ఎన్నిక‌ల గ‌ల్లంతు విష‌యంలో వైసీపీ ప‌క్కా వ్యూహంతో ప‌ర్‌ఫెక్ట్ స్టెప్ వేసి, అధికార తెలుగేదేశం పార్టీకి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుందని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.
Top