పబ్లిక్ గానే జనసేన నాయకులకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలు వస్తున్న తరుణంలో రాయలసీమ ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల సభలు సమావేశాలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ కి రాయలసీమ ప్రాంత వాసులు బ్రహ్మరథం పట్టారు. రాయలసీమ ప్రాంతం పౌరుషానికి ప్రతీక అని నేను రాజకీయాలలో పౌరుషం గానే నిర్ణయాలు తీసుకుంటానని రాయలసీమ ప్రాంత వాసులకు అద్భుతమైన సూక్షమైన పాలన అందిస్తానని ప్రజల కోసం పోరాటానికి రాజకీయాల్లోకి వచ్చానని ఇటీవల ఓ భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
ఈ క్రమంలో ఇటీవల ఒంగోలులో విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించిన పవన్ కళ్యాణ్ కి ఓ విద్యార్థి నుండి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇంతకీ ఆ విద్యార్థిని అడిగిన ప్రశ్న ఏమిటంటే ఎన్నో తప్పులు చేసే రాజకీయ నాయకులను ఇతర పార్టీలు తమతోనే ఉంచుకుంటున్నారు..మీ పార్టీలో వారు తప్పు చేస్తే మీరేం చేస్తారు అని అడగగా. దీనికి పవన్ ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చారు. తాను అందరిలాగా వదిలిపెట్టను తన పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే క్షమించేది లేదు అని ఒక్కొక్కరి తోలు తీసేస్తానని పవన్ తన పార్టీ శ్రేణులకు ముందే గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన జవాబు కి అక్కడున్న విద్యార్థుల మొత్తం గట్టిగా అరిచారు.