రహస్యంగా సమావేశమైన కోడెల - లగడపాటి రాజగోపాల్..?

Written By Xappie Desk | Updated: March 06, 2019 11:58 IST
రహస్యంగా సమావేశమైన కోడెల - లగడపాటి రాజగోపాల్..?

రహస్యంగా సమావేశమైన కోడెల - లగడపాటి రాజగోపాల్..?
 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సత్తెనపల్లి శాసన సభ్యుడు అయిన కోడెల శివ ప్రసాద్ మరియు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తాజాగా రహస్యంగా సమావేశమైనట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరో సారి అధికారం చేజిక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ మరియు రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్ర కృషి చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయిన అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాలలో ప్రజలతో మమేకమవుతూ బిజీ బిజీగా ఉంటున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్ గతంలో రాజకీయాల నుంచి తప్పుకున్నానని ప్రకటించి ఇటీవల ఆంధ్ర అధికార పార్టీ టిడిపి నేతలతో ఒరిస్సా సమావేశాలు అవటంతో రానున్న ఎన్నికల్లో లగడపాటి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు గా ఏపీ రాజకీయాల్లో టాక్ వినబడుతోంది. ఇదిలా ఉండగా ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఏపీ స్పీకర్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావుతో రహస్యంగా భేటీ అయ్యారు. గుంటూరు టౌన్ లోని చుట్టుగంట సెంటర్‌లో ఉన్న హోండా షోరూమ్ లో ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు.
 
ఈ సారి ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఎలాగూ ఖాళీ లేని నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని లగడపాటి భావిస్తున్నారని స‌మాచారం. ఈ విష‌యంపై వీరిద్ధ‌రి భేటీ జ‌రిగింద‌ని తెలుస్తోంది. కోడెలను డైరెక్ట్‌గా ఆయన నివాసంలోనూ కలిసే వీలున్నా… బయటి ప్ర‌పంచానికి తెలీకుండా ఉండాల‌నే ఓ బైక్ షోరూమ్‌లో క‌లిసిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా మాగంటి బాబు ఉన్నారు. మరి ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానం నుండి లగడపాటిని చంద్రబాబు బరి లోకి దింపుతారో లేదో చూడాలి.
Top