హైకోర్టును ఆశ్రయించిన ఐటి గ్రిడ్స్ యండి అశోక్..?

Advertisement

by Xappie Desk | March 09, 2019 12:42 IST
Follow Xappie
హైకోర్టును ఆశ్రయించిన ఐటి గ్రిడ్స్ యండి అశోక్..?

హైకోర్టును ఆశ్రయించిన ఐటి గ్రిడ్స్ యండి అశోక్..?
 
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపీ ప్రజల డేటా లీకేజ్ విషయం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు. ఈ విషయంపై ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇది ప్రతిపక్ష పార్టీ వైసీపీ మరియు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కలిసి ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నీచమైన కుట్ర అంటూ కామెంటు చేస్తున్న క్రమంలో తెలంగాణ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఐటి గ్రిడ్స్ సంస్థ సిఇఓ అశోక్ తాజాగా హై కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వినబడుతున్నాయి.
 
తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై గత కొంతకాలంగా జరుపుతున్న విచారణను నిలిపివేయాలని, కేసును కొట్టివేయాలని అశోక్‌ తెలంగాణ హైకోర్టుకు వెళ్లారని వార్త వచ్చింది. దీనిపై ఆయన క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని, అప్పటివరకు ఈ కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అశోక్‌ కోరినట్టు తెలుస్తోంది. ఈ పిటిషన్‌ శనివారం లేదా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పిటిషన్‌లో తెలంగాణ పోలీసులను ప్రతివాదులుగా చేశారు. తాము ఎలాంటి డేటా దుర్వినియోగానికి పాల్పడలేదని, వ్యాపారపరమైన లావాదేవీలు మాత్రమే చేసినట్టు అశోక్‌ తన పిటిషన్‌లో తెలిపినట్లు మీడియాలో కధనాలు వచ్చాయి. వారి బయటకు వచ్చిన వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే హైకోర్టు స్పందించాల్సిన అవసరముంది. మరోపక్క ఇటువంటి కేసుల్లో హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా రాజకీయ మేధావులు ఆసక్తిగా గమనిస్తున్నారు.


Advertisement


Advertisement

Top