డ్వాక్రా మహిళలకు సంచలన హామీ ఇచ్చిన చంద్రబాబు..!

By Xappie Desk, March 09, 2019 12:45 IST

డ్వాక్రా మహిళలకు సంచలన హామీ ఇచ్చిన చంద్రబాబు..!

డ్వాక్రా మహిళలకు సంచలన హామీ ఇచ్చిన చంద్రబాబు..!
 
ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు చంద్రబాబు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోలేదని తన బాధను తెలియజేస్తూ సభలలో గత నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలు మరియు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా తన పాలనకు అడ్డుపడిన వంటి విషయాలను ప్రజలకు తెలియ చేస్తున్న చంద్రబాబు అష్ట కష్టాలు పడుతున్న ఆంధ్రరాష్ట్రంలో ప్రజలకు ఎన్నికల ముందు ఇస్తున్న హామీలు ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే విధంగా ఉంటున్నాయి.
 
ఈ క్రమంలో తాజాగా డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఒక సంచలనం సృష్టించింది. ఇటీవల ఓ భారీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు త్వరలోనే డ్వాక్రా సంఘాల సభ్యులకు స్మార్ట్ పోన్ లు ఇస్తామని చెప్పారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. భారతదేశానికి కుటుంబ వ్యవస్థ ఓ గొప్ప వరమన్నారు. చాలామంది మహిళల్లో సమర్థ నాయకత్వం ఉందని ఆయన అన్నారు. 98 లక్షల మంది పేద మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, 35,600 గ్రామ సమాఖ్యలు ఉన్నాయని తెలిపారు. కోటి మంది ఆడ బిడ్డలకు ‘పసుపు-కుంకుమ’ ఇస్తున్నట్టు తెలిపారు. దీంతో ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయింది.Top