కేసీఆర్ - జగన్ లపై సంచలన కామెంట్స్ చేసిన సినీ నటుడు శివాజీ..!

By Xappie Desk, March 09, 2019 13:00 IST

కేసీఆర్ - జగన్ లపై సంచలన కామెంట్స్ చేసిన సినీ నటుడు శివాజీ..!

కేసీఆర్ - జగన్ లపై సంచలన కామెంట్స్ చేసిన సినీ నటుడు శివాజీ..!
 
గతంలో ఆపరేషన్ గరుడ అంటూ తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సినీ నటుడు ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యుడు శివాజీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా లీకేజ్ వ్యవహారం గురించి సంచలన కామెంట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ప్రజల ముందు అపహాస్యం చేసి జగన్ ముఖ్యమంత్రి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు డేటా లీకేజ్ వ్యవహారం అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన శివాజీ తెలంగాణ సీఎం కెసిఆర్ ని మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు… ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ… ”గ్రేటర్‌ పరిధిలో 40 లక్షలకు పైగా సెటిలర్లు ఉన్నారు. ఈసీని కలవడానికి ముందే సమగ్ర సర్వే చేసి, అందరి వివరాలను తీసుకోని మోసానికి పాల్పడ్డారు… ఎస్‌ఆర్‌డీహెచ్‌ అప్లికేషన్‌ తెలంగాణ పోలీస్ శాఖ తయారు చేసింది. ఈసీ, సీఎస్‌, గ్రేటర్‌ కమిషనర్‌ కలసి పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలనుకున్నారు. వారి మధ్యన కుదిరిన సఖ్యత వలన ఈసీ వద్ద నుంచి ఆధార్‌ డేటా, ఓటర్ లిస్టును తీసుకున్నారు. ఇపుడు తెలంగాణ ప్రభుత్వం మాకు తప్పకుండ సమాధానం చెప్పి తీరాలి… అని శివాజీ మాట్లాడారు.Top