తెలుగుదేశం పార్టీకి కలలో కూడా ఊహించని అవమానం..!

Written By Xappie Desk | Updated: March 09, 2019 13:04 IST
తెలుగుదేశం పార్టీకి కలలో కూడా ఊహించని అవమానం..!

తెలుగుదేశం పార్టీకి కలలో కూడా ఊహించని అవమానం..!
 
మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎంతో చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కరువు అవుతున్నట్లు తెలుగు రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగైపోయిన తెలుగుదేశం పార్టీని ఆంధ్రలో బ్రతికించడానికి నానా తంటాలు పడుతున్నారు అధినేత చంద్రబాబు. రాబోయే ఎన్నికలకు టికెట్ ఇస్తాము అని పిలిచినా గాని అభ్యర్థులు టిడిపి తరఫున పోటీ చేయడానికి ఇష్టపడటం లేదని ఆంధ్ర రాజకీయాల్లో తెగ కామెంట్లు వినబడుతున్నాయి.
 
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ దాదాపు సిట్టింగ్‌ల‌కే టికెట్లు ఇచ్చి పార్టీని మ‌రో సారి అధికారంలోకి తీసుకొచ్చారు. కాని ఏపీలో మాత్రం బాబు అంత సీన్ లేదు. దానికి కార‌ణం ఇక్క‌డ బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష‌పార్టీ ఉండ‌ట‌మే. నాలుగు దశాబ్దాల చరిత్ర వున్న తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులకొర‌త ఉంద‌ని సాక్షాత్యు బాబే సెల‌వివ్వ‌డం చూస్తె ఆపార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలిసిపోతోంది. ఎంతో చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి రావడం మొట్ట మొదటి సారి అని సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ అధికార పార్టీ టిడిపిని మరియు ఆ పార్టీకి మద్దతు తెలిపే మీడియాని ఏపీ ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లారని...తెలుగుదేశం పార్టీకి ఎంత మైలేజ్ ఇచ్చే కథనాలు ఎల్లో మీడియా లో ప్రసారం చేసిన ప్రజలు నమ్మలేని స్థితిలో ఉండేలా ప్రజలను చైతన్య పరిచారు జగన్ అంటూ సీనియర్ రాజకీయ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తాజా పరిణామం తెలుగుదేశం పార్టీకి కలలో కూడా ఊహించని అవమానం అంటూ మరికొంతమంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
Top