ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల అధినేతలు తమ పార్టీ తరపున అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తలమునకలయ్యారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా రానున్న ఎన్నికల్లో ఎప్పటిలాగానే గత ఎన్నికల మాదిరిగానే ప్రధాన పోటీ తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీల మధ్య ఉండటంతో రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న బిజెపి జనసేన పార్టీలు రాబోతున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాణించడానికి తెలుగుదేశం పార్టీ నానా తంటాలు పడుతోంది. అయితే మరోపక్క జనసేన, ప్రజాశాంతి పార్టీలు అధికార టీడీపీని కాకుండా ప్రతిపక్ష వైసీపీని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తుండడంతో, ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీనే అధికారంలో ఉందా అనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ గాలీ జోరుగా వీస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే విడుదల అయిన పలు జాతీయ సర్వేలు కూడా అదే విషయాన్ని తెలిపాయి. మరోవైపు వైసీపీ జోరు దెబ్బకి అధికార తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా ఆ పార్టీలోకి క్యూలు కడుతున్నారు. అయితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాత్రం వైసీపీ అధికారంలోకి రాదని జగన్ ఇప్పుడప్పుడే ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదని ఎంత డబ్బులు ఖర్చు పెట్టిన జగన్ సీఎం కాలేరని కెఎ పాల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రజాశాంతి పార్టీ పేరు చెప్పినా కెఎ పాల్ పేరు వినపడినా వైసీపీ నేతలు కార్యకర్తలు బెదిరిపోతున్నారు అంటూ పాల్ కామెంట్లు చేశారు.