హైదరాబాద్ నుండి ఎందుకు అమరావతి వచ్చేసారో నిజం చెప్పేసిన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: March 10, 2019 11:29 IST
హైదరాబాద్ నుండి ఎందుకు అమరావతి వచ్చేసారో నిజం చెప్పేసిన చంద్రబాబు..!

హైదరాబాద్ నుండి ఎందుకు అమరావతి వచ్చేసారో నిజం చెప్పేసిన చంద్రబాబు..!
 
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా లీకేజ్ వ్యవహారం తెగ కుదిపేస్తోంది. తెలంగాణ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మరియు ఆంధ్రలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీల మధ్య ఈ కేసు వ్యవహారం నేను రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ కేసు గురించి మాట్లాడుతూ జగన్ కెసిఆర్ కలిపి చేస్తున్న కుట్ర అంటూ పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం గురించి ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలపై ఆరోపణలు చేస్తున్న క్రమంలో తాజాగా చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలో డేటా లీకేజ్ కేసు గురించి మాట్లాడుతూ...హైదరాబాదు నుండి అమరావతికి ఎందుకు వచ్చేసారో పుసుక్కున నోరు జారారు. ఇన్నాళ్ళూ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను హైదరాబద్ వదిలి వచ్చాను అని చెప్పుకునే చంద్రబాబు .. ఇప్పుడు మాత్రం రాజకీయ కారణాల రిత్యా నే హైదరాబాద్ వచ్చాను అని నిజం ఒప్పుకోవడం షాకింగ్ అంశం గా చెప్పాలి. అమరావతి మరియూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసమే తాను ఇంత హడావిడి గా హైదరాబాద్ నుంచి వచ్చేసాను అని పదే పదే చెబుతూ ఉంటారు ఆయన అలాంటిది ఫైనల్ గా తన మనసులో మాటని చంద్రబాబు బయట పెట్టినట్టు గా అయ్యింది. దీంతో తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
Top