జగన్ ఆదేశిస్తే అతనిపై పోటీచేసి గెలుస్తానని సంచలన కామెంట్స్ చేసిన మోదుగల..!

Written By Aravind Peesapati | Updated: March 10, 2019 11:35 IST
జగన్ ఆదేశిస్తే అతనిపై పోటీచేసి గెలుస్తానని సంచలన కామెంట్స్ చేసిన మోదుగల..!

జగన్ ఆదేశిస్తే అతనిపై పోటీచేసి గెలుస్తానని సంచలన కామెంట్స్ చేసిన మోదుగల..!
 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం రోజుకో విధంగా మారిపోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రావడం ఖాయమని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు ప్రముఖులు మరియు అధికార పార్టీ టీడీపీకి చెందిన నాయకులు వైసీపీ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈ క్రమంలో గుంటూరు రాజకీయాలలో పేరొందిన మోదుగల తాజాగా వైసీపీ పార్టీ లోకి రావడంతో గుంటూరు రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తే పార్టీలో సరైన గౌరవం ఇవ్వటం లేదని మాట్లాడుతూ తనలాంటి పరిస్థితి మరో నాయకుడికి రాకూడదని మరియు ప్రజలను మోసం చేసే నాయకులకు త్వరలోనే వైసీపీ పార్టీ మరియు జగన్ కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మోదుగల. అంతేకాకుండా గుంటూరు లోకసభ నుండి అధినేత జగన్ ఆదేశిస్తే గల్లా జయదేవ్ పై పోటీ చేస్తానని మోదుగుల ప్రకటించారు.
Top