ఏపీలో మోగిన ఎన్నికల నగారా…!

Written By Aravind Peesapati | Updated: March 11, 2019 09:41 IST
ఏపీలో మోగిన ఎన్నికల నగారా…!

ఎప్పుడెప్పుడా అని ఎన్నికలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల తేదీ మరియు కౌంటింగ్ తేదీ ప్రకటన చేయడంతో పార్టీల అధినేతలు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే తమ పార్టీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేస్తున్న నేతలకు తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తేదీ విని షాక్ అయ్యారు. జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల తేదీ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా వెల్లడించారు. ఈ ఎన్నికలు తొమ్మిది దశలో జరగబోతున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ క్రమంలో మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరియు తెలంగాణా లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఒకేరోజూ అనగా ఏప్రిల్‌ 11వ తేదీన నిర్వహించబోతున‍్నట్లు సీఈసీ సునీల్‌ ఆరోరా వెల్లడించారు.
 
క్లుప్తంగా ఎన్నికల దశల షెడ్యూల్ వివరాలు:
 
తొలి దశ: పోలింగ్ ఏప్రిల్ 11 -ఏపీ, తెలంగాణ సహా మరో 22రాష్ట్రాల్లో జరగనున్నాయి
 
రెండో దశ: ఏప్రిల్ 18 – కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర
 
మూడో దశ: పోలింగ్ తేదీ ఏప్రిల్ 23 – అస్సాం, ఛత్తీస్ గఢ్
 
నాలుగో దశ: పోలింగ్ తేదీ ఏప్రిల్ 29 – జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా
 
ఐదో దశ: పోలింగ్ తేదీ మే 6 – జమ్మూ కాశ్మీర్
 
ఆరో దశ: పోలింగ్ తేదీ మే 12 – బీహార్, హర్యాన, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ
 
ఏడో దశ: పోలింగ్ తేదీ మే 19 – బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్.
Top