చివరాకరికి వైసీపీ పార్టీ లోకి వెళ్లడానికి సిద్ధమైన ఆలీ..!

Written By Xappie Desk | Updated: March 11, 2019 09:48 IST
చివరాకరికి వైసీపీ పార్టీ లోకి వెళ్లడానికి సిద్ధమైన ఆలీ..!

కమెడియన్ అలీ పొలిటికల్ కెరియర్ గురించి ఇటీవల సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. తెలుగుదేశం పార్టీలోకి ఆలీ వెళ్తున్నాడని చంద్రబాబు తో భేటీ అయ్యారు అని ఇటీవల అనేక వార్తలు వచ్చాయ్. అయితే సీఎం చంద్రబాబుతో ఆలీ పార్టీలో గెలిస్తే కనుక కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ పెట్టడంతో తెలుగుదేశం పార్టీ నుండి సరైన సమాధానం రాకపోవడంతో ఆలీ యూటర్న్ తీసుకుని తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలావుండగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తేదీ ప్రకటించే డంతో ఆలస్యం అయితే తన పొలిటికల్ కెరియర్ కి పెద్ద ప్రమాదం పొంచి ఉంటుందని ఆలీ భావించినట్లు తాజా నిర్ణయంతో తెలుస్తుంది. గతంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వక ముందు వస్తున్న వార్తల సమయం లో ఏదైనా పార్టీలోకి వెళితే కనుక ఖచ్చితం గా ఎమ్మెల్యే టికెట్‌తో పాటు మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వాల‌ని ఓపెన్‌గా చెప్పాశారు అలీ. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌తో భేటీ అయిన‌ప్పుడే అలీ వైసీపీలో చేరుతున్నార‌నె వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన క్రమంలో ఆల‌స్యం చేస్తె ప‌మ‌స్య‌లు వచ్చే అవ‌కాశం ఉండ‌టంతో లేట్ చేయ‌కుండా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీ నేతలతో కమెడియన్ ఆలీ మంతనాలు జరిపినట్లు కూడా ఏపీ పొలిటికల్ నేతల టాక్. ఏది ఏమైనా రోజురోజుకి వైసిపి పార్టీకి సినీ గ్లామర్ పెరుగుతుంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.
Top