భారీ విమాన ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు..!

Written By Xappie Desk | Updated: March 11, 2019 09:52 IST
భారీ విమాన ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు..!

ప్రస్తుత సమాజంలో మానవ జీవితానికి గ్యారెంటీ లేదు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. తినే తిండిలో అయినా పీల్చే గాలిలో అయినా అంతా కల్తీ కలుషితం. అయితే మనిషి ప్రయాణిస్తున్న ప్రయాణాలకు కూడా ఎక్కడ ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాని రోజుల్లో సమాజంలో జీవిస్తున్నాం. ఈ క్రమంలో ఇధియోఫియా దేశంలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. ఇదియోపియా ఎయిర్ లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. ఆ దేశ రాజదాని అడిస్ అబబా నుంచి కెన్యా రాజదాని నైరోబి వెళుతుండగా మార్గ మద్యంలో కుప్పకూలినట్లు సమాచారం వచ్చింది. ప్రమాదానికి గురైన విమానంలో 149 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు.వీరిలో ఎవరైనా బతికి బయటపడ్డారా ?లేదా అన్నది తెలియరాలేదు. ప్రమాద కారణాలు తెలియవలసి ఉంది. కాగా కొలంబియాలో జరిగిన మరో విమానం కొప్పకూలగా పన్నెండు మంది మరణించారు. తాజాగా జరిగిన ఈ ఘటనతో యావత్ ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది.
Top