తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ప్రకటన చేయడంతో నెలలోపే అనగా ఏప్రిల్ 11 న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పాదయాత్ర చేసి మరోపక్క సమరశంఖం సభలు నిర్వహిస్తూ ఆంధ్ర రాజకీయ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్న జగన్ తాజాగా విడుదలైన ప్రకటనతో అందుబాటులో ఉన్న వైసీపీ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11 తెలుగు రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ సీనియర్ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ప్రజా సంకల్ప పాదయాత్ర తో రాష్ట్రంలో వైసీపీ పార్టీ గ్రాఫ్ పెంచేసిన అధినేత జగన్ కొన్ని చోట్ల పాదయాత్ర నిర్వహించారు ఈ ప్రాంతంలో బస్సు యాత్ర కు గతంలో శ్రీకారం చుట్టారు. అయితే తాజాగా ఎన్నికల సంఘం నెలలోపే ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల తేదీ ప్రకటించడంతో పార్టీలో ఉన్న సీనియర్ నేతలతో తాజా రాజకీయ పరిణామాలు గురించి మరియు ఎన్నికల హామీల విషయం గురించి మేనిఫెస్టో గురించి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వైసీపీ పార్టీ నేతల నుండి వస్తున్న సమాచారం.