రోజురోజుకి వైసీపీ పార్టీ కి పెరిగిపోతున్న సినీ గ్లామర్..!

Written By Xappie Desk | Updated: March 12, 2019 09:36 IST
రోజురోజుకి వైసీపీ పార్టీ కి పెరిగిపోతున్న సినీ గ్లామర్..!

రోజురోజుకి వైసీపీ పార్టీ కి పెరిగిపోతున్న సినీ గ్లామర్..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం అంతట అలుముకుంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ఏప్రిల్ 11 అని ప్రకటన చేయడంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు మరియు కార్యకర్తలు 2019 ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. అయితే తన పాదయాత్రతో ఇప్పటికే రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని అందుకున్న వైసీపీ అధినేత జగన్ కి రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో పాజిటివ్ ఫలితాలు రావటంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు మరియు ప్రముఖులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు వైసీపీ పార్టీ లోకి రావడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది వైసీపీ పార్టీ కండువా కప్పుకున్న సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఇటీవల కమెడియన్ ఆలీ కూడా జగన్ కి జై కొట్టారు.
 
ఈ క్రమంలో టాలీవుడ్ సెన్సేషనల్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా వైసిపి పార్టీలోకి వస్తున్నట్లు ఏపీ పొలిటికల్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. గతంలోనే వైయస్ జగన్ కి మరి పూరి జగన్ కి మంచి సాహిత్యం ఉంది. అప్పట్లో వైసీపీ పార్టీకి మద్దతుగా నర్సీపట్నంలో పూరీ ప్రచారం కూడా చేసాడు, నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ కు మద్దతుగా 2014ఎన్నికల్లో ప్రచారం చేసారు పూరీ. అప్పట్లో మంత్రి అయ్యన్నపాత్రుడు చేతిలో ఓడిపోయారు ఉమాశంకర్, ఈ సారి ఎన్నికల్లో కూడా ఆయనకే సీటివ్వనుండటంతో పూరీ కచ్చితంగా వైసీపీలో చేరుతారని వార్తలొస్తున్నాయి. ఇదే వార్త వాస్తవమైతే కచ్చితంగా వైసీపీ పార్టీ కి రోజురోజుకీ సినీ గ్లామర్ పెరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.
Top