చంద్రబాబు కి చెమటలు పట్టిస్తున్న అనంతపురం రాజకీయాలు..!

Written By Xappie Desk | Updated: March 12, 2019 09:45 IST
చంద్రబాబు కి చెమటలు పట్టిస్తున్న అనంతపురం రాజకీయాలు..!

చంద్రబాబు కి చెమటలు పట్టిస్తున్న అనంతపురం రాజకీయాలు..!
 
కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కంగుతింది అధికార పార్టీ తెలుగుదేశం. సరిగ్గా సమయం చూస్తే నెల ఉన్న క్రమంలో ఏం చెయ్యని అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయినట్లు అయింది టీడీపీ అధినేత చంద్రబాబు కి. అడపాదడపా కొన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొన్ని టికెట్లను ప్రకటించిన సంగతి మనకందరికీ తెలిసినదే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థులు ఎవరూ ఊహించని వారు కావడంతో కొన్ని స్థానాలలో అభ్యర్థుల విషయంలో చాలా సమయం తీసుకుంటున్నారు చంద్రబాబు. ముఖ్యంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం అభ్యర్థిత్వం గురించి చంద్రబాబు చాలా టెన్షన్ పడుతున్నట్లు టిడిపి వర్గాల నుండి వస్తున్న సమాచారం.
 
ఇంతకీ విషయం ఏమిటంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్ కు టికెట్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, సునీతకు రాప్తాడు నుంచి టికెట్ కన్ఫార్మ్ చేయగా, శ్రీరామ్ సంగతి ఏంటన్నదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. అనంతపురంలో ఇప్పటికే జేసీ వారసులకు దాదాపుగా టికెట్లు కన్ఫామ్ అయ్యాయి, దీంతో శ్రీరామ్‌కు కూడా టికెట్ ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ఈ మేరకు సునీత ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారట అయితే, కళ్యాణదుర్గం నుండి అమిలినేని సురేంద్ర బాబు కూడా టికెట్ ఆశిస్తున్నారట. ఈ విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చలేకపోతున్నారని సమాచారం అందుకే కల్యాణ దుర్గం స్థానానికి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదట. మొత్తంమీద ఎన్నికల ముందు అనంతపురం రాజకీయాలు చంద్రబాబుని మరోసారి ప్రస్తుత పరిస్థితి బట్టి టెన్షన్ పెడుతున్నట్లు అర్థమవుతుంది.
Top