రాబోయే ఎన్నికల ప్రచారం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: March 12, 2019 09:48 IST
రాబోయే ఎన్నికల ప్రచారం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..!

రాబోయే ఎన్నికల ప్రచారం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..!
 
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో పోలింగ్ చేతి ఒక్కసారిగా ప్రకటించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బిజెపి మరియు జనసేన పార్టీ లతో కలసి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఈ క్రమంలో తాజాగా మాత్రం తెలుగుదేశం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల తేదీ ప్రకటించే వైసీపీ పార్టీ అధినేత జగన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో సమరశంఖం సభ నిర్వహించి శంఖం మోగించి ఎన్నికల యుద్ధానికి రెడీ అయ్యారు. అయితే మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 16వ తేదీన తిరుపతి నుండి ప్రచారాన్ని ప్రారంభించడానికి అన్ని విధాలా సిద్ధమయ్యారు.
 
అంతేకాకుండా ఉత్తరాంధ్ర నుండి చంద్రబాబునాయుడు రోడ్‌షో‌లను మొదలుపెట్టనున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను చంద్రబాబునాయుడు దాదాపుగా పూర్తి చేశారు. తిరుపతిలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న తర్వాత వెంటనే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తిరుపతిలో సభ నిర్వహించిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల క్యాంపెయినింగ్ ప్రారంభించనున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. అంతేకాకుండా వీలైనన్ని భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలలోకి అతి తక్కువ సమయంలోనే బలంగా వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారట చంద్రబాబు.
Top