టిడిపిని బంగాళాఖాతంలో కలిసే సమయం ఆసన్నమైంది: జగన్..!
కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ నోటిఫికేషన్ విడుదల చేశాక వైసీపీ అధినేత జగన్ సెంటిమెంట్ గా తూర్పు నుండి అనగా తూర్పు గోదావరి జిల్లా నుండి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన శంకారావం సభలో జగన్ తెలుగుదేశం పార్టీ గురించి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలా బ్రష్టు పట్టించారు అని రాష్ట్రం మొత్తం అవినీతిమయం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు జగన్.
ఈ గ్రామంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కుటుంబంగా ఒకటై చర్చించి రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అన్యాయాన్ని గమనించాలని తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపే సమయం ఆసన్నమైందని ప్రజలందరూ ఆ పని చేయాలని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకుండా ఉండే విధంగా ఏపీ ప్రజలు తీర్పు ఇవ్వాలని సూచించారు. ఇక జగన్ మాట్లాడుతూ జరగబోతున్న ఎన్నికలు పార్టీల మధ్య కాదు నీతికి అవినీతికి మధ్య మరియు విశ్వసనీయతకు అవకాశవాదానికి మధ్య జరుగుతున్నాయి అని పేర్కొన్నారు. తన స్వలాభం కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయంలో కేంద్రం తో గత నాలుగు సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరు గుర్తుండిపోయే విధంగా తీర్పు ఇవ్వాలని కాకినాడ సభ లో జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.