డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై చెలరేగిపోతున్న టీడీపీ నేతలు..!

Written By Xappie Desk | Updated: March 13, 2019 12:20 IST
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై చెలరేగిపోతున్న టీడీపీ నేతలు..!

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై చెలరేగిపోతున్న టీడీపీ నేతలు..!
 
స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితంలో లక్ష్మీపార్వతి ఎంటర్ అయ్యాక రాజకీయంగా ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయి వంటి వాస్తవాలను కళ్లకు కడుతూ సినిమా ఉంటుందని లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా టైటిల్ పెట్టి అసలు సిసలైన కథ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.
 
దీంతో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా గురించి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర ప్రతికూలంగా ఉన్నట్లు ట్రైలర్ లో కనబడుతున్న క్రమంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆపడానికి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఈ సినిమా టిడిపికి వ్యతిరేకంగా ఉందని, దీని ప్రబావం ఎన్నికలపై ఉండే అవకాశం ఉంటుందని, అందువల్ల మొదటి దశ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు సినిమా విడుదల ఆపాలని టిడిపి ఎన్నికల కమిషన్ ను కోరారట. ఈ విషయాన్ని వర్మ తెలుపుతూ టిడిపి నేతలు ఒక విషయం తెలుసుకోవాలని, నిజాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.
 
కాగా ఆయన మరో వీడియోని విడుదల చేశారు. అందులో ఎన్.టి.ఆర్. చివరి రోజులలో చంద్రబాబును ఉద్దేశించి దూషించిన సన్నివేశం ఉంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన చివరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Top