సంచలన నిర్ణయం తీసుకున్న మమతా బెనర్జీ..!

Written By Xappie Desk | Updated: March 13, 2019 12:24 IST
సంచలన నిర్ణయం తీసుకున్న మమతా బెనర్జీ..!

సంచలన నిర్ణయం తీసుకున్న మమతా బెనర్జీ..!
 
త్వరలో దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఇప్పటికే పలు రాష్ట్రాలలో ప్రచారం మొదలు పెట్టేసింది. ఇదే క్రమంలో బిజెపి పార్టీకి కొంత టెన్షన్ పెట్టిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ...త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ తరఫున మమత బెనర్జీ 41 శాతం మంది మహిళలకు లోక్ సభ టిక్కెట్లు కేటాయించడంతో ఈ వార్త జాతీయ రాజకీయాల్లో సంచలనం అయ్యింది.
 
తృణమూల్ కాంగ్రెస్ నుంచి అత్యధిక సంఖ్యలో మహిళలకు టిక్కెట్లు ఇస్తున్నానని, మిగిలిన పార్టీలకు సవాల్ విసురుతున్నానని ఆమె అన్నారు. మహిళల రిజర్వేషన్ ల గురించి మాట్లాడే పార్టీలు ఏమి చేస్తాయో చూడాలని ఆమె అన్నారు. ముగ్గురు బెంగాలి నటీమణులకు కూడా టిక్కెట్లు ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నుస్రత్‌ జహాన్‌, మిమీ చక్రబర్తి, మున్‌ మున్‌ సేన్‌లకు టికెట్‌ ఖరారు చేసినట్లు ఆమె ప్రకటించారు. అసనోల్‌ నియోజక వర్గం నుంచి కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోకు పోటీగా మున్‌ మున్‌ సేన్‌ బరిలోకి దిగుతారని మమత పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఎంసీలో చేరిన మౌసమ్‌ నూర్‌ మల్దా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ఇటీవల దారుణంగా హత్యకు గురైన టీఎంసీ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిస్వాస్‌ భార్య రుపాలీ బిస్వాస్ కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతారని మమత పేర్కొన్నారు.
Top