బిగ్ బ్రేకింగ్ న్యూస్: టీడీపీ లోకి జేడీ లక్ష్మీనారాయణ..?

Written By Xappie Desk | Updated: March 13, 2019 12:47 IST
బిగ్ బ్రేకింగ్ న్యూస్: టీడీపీ లోకి జేడీ లక్ష్మీనారాయణ..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్: టీడీపీ లోకి జేడీ లక్ష్మీనారాయణ..?
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన జేడీ లక్ష్మీనారాయణ వైసీపీ అధినేత జగన్ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తున్నారు అంటూ అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అయితే తర్వాత జేడీ లక్ష్మీనారాయణ మహారాష్ట్ర రాష్ట్రానికి బదిలీ అవ్వడం తర్వాత తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావటం మరియు ఇటీవల రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా రైతులతో సమావేశమై పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు పేర్కొనడంతో జేడీ లక్ష్మి నారాయణ పొలిటికల్ ఎంట్రీ ఖరారైందని అందరూ అనుకున్నారు.
 
అయితే కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న జేడీ లక్ష్మీనారాయణ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల తేదీ ప్రకటించడంతో జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెగ వార్తలు వినపడుతున్నాయి. ఇదే విషయాన్ని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి సంచలన కామెంట్లు చేశారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసి తమ పార్టీ అదినేత జగన్ పై అక్రమ కేసులు వేసినప్పుడు లక్ష్మీనారాయణ వ్యవహరించిన తీరు, చార్జీషీట్ లు వేసిన వైనం ,చంద్రబాబుతో సంబందంతోనే ఇదంతా జరగుతున్నట్లు అప్పట్లోనే తామంతా చెప్పామని, ఇప్పుడు అవి రుజువు అవుతున్నాయని ఆయన అన్నారు.
 
లక్ష్మీనారాయణ భీమిలి నుంచి టిడిపి పక్షాన పోటీచేస్తున్నట్లు ఈనాడు లో వచ్చిన వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, మాజీ జెడి లక్ష్మీనారాయణ ల మద్య సంబందాలపై విచారణ జరగాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుంది ప్రజలంతా గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని వైసీపీ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు అంబాటి రాంబాబు.
Top