కొడాలి నానితో వంగవీటి రాధా …?

Written By Xappie Desk | Updated: March 13, 2019 12:59 IST
కొడాలి నానితో వంగవీటి రాధా …?

కొడాలి నానితో వంగవీటి రాధా …?
 
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆంధ్ర రాజకీయ ముఖచిత్రం రోజుకో విధంగా మారుతుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. గుడివాడ నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొడాలి నాని తాజాగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన వంగవీటి రాధా తో ఇటీవల గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్‌ పార్క్‌లో నానిని కలిసినట్లు వార్తలు వినబడుతున్నాయి.
 
ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ని ఎలాగైనా ఓడించి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయాలని చూస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఆ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ని బరిలోకి దింపారు. ఈ క్రమంలో గుడివాడ నియోజకవర్గంలో కాపు ఓట్లు ఇరవై నాలుగు వేలకు పైగా ఉన్న నేపథ్యంలో వంగవీటి రాధ మద్దతు కూడగట్టుకొని రాబోయే ఎన్నికల్లో రాణించాలని కొడాలి నాని రాధాకృష్ణ తో భేటీ అయినట్లు టాక్ వినపడుతోంది.
 
మరియు అదే విధంగా రాజకీయంగా దేవినేని మరియు వంగవీటి కుటుంబాల మధ్య ఢీ అంటే ఢీ అనే విధంగా వాతావరణం ఉన్న నేపథ్యంలో... ఈ పాయింట్ ను ఆధారం చేసుకుని కొడాలి నాని రాజకీయంగా వంగవీటి రాధాకృష్ణ తనకు ఉపయోగపడేలా చూసుకుంటున్నారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా రాజకీయాలకతీతంగా కూడా కొడాలి నాని మరియు వంగవీటి రాధాకృష్ణ మంచి స్నేహితులు అయిన నేపథ్యంలో ఖచ్చితంగా వంగవీటి రాధా కొడాలి నానికి మద్దతివ్వడం ఖాయమని మరి కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
Top