ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీలకు దీటుగా జనసేన పార్టీని రెడీ చేస్తున్నారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఇటీవల రాయలసీమ ప్రాంతంలో పర్యటించి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ జగన్ పై వేడెక్కించే కామెంట్ చేసి ఆంధ్ర రాజకీయాలు రసవత్తరంగా చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా గతంలో చంద్రబాబు జగన్ పై చేసిన కామెంట్స్ తిరిగి పవన్ కళ్యాణ్ చేయడం ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన నేపథ్యంలో బీజేపీ పార్టీ కి జగన్ ఎందుకు మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీతో జగన్ లాలూచీ పడ్డారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అలాగే టిఆర్ఎస్ తో ఎలా జగన్ అవగాహన పెట్టుకున్నారని ఆయన అన్నారు. జగన్ కు చెబుతున్నా... ఆంద్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారితో ఎలా స్నేహం చేస్తారు అని ఆయన అన్నారు. తనకు కెసిఆర్ అంటే గౌరవం అని ఆయన అన్నారు. ఆవేదనగా ఉంది... బాదగా ఉంది అని ఆయన అన్నారు. అలాగే చంద్రబాబుకు తెలియచేస్తున్నాను. మొదటి రోజు నుంచి తనకు అండగా ఉంటే ప్రత్యేక హోదా తెచ్చేవారం. వారు మాట మార్చిన విధానం బాద కలిగించింది. ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. తాను ఒక మాట చెబితే వెనక్కి తిప్పను అని ఆయన అన్నారు. 2019 మార్పుకు చిహ్నమని పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్ చేశారు.