తొలి అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ..!

By Xappie Desk, March 15, 2019 10:20 IST

తొలి అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ..!

తొలి అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ..!
 
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంక నెలరోజులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జనసేన పార్టీ మరియు వైసీపీ పార్టీ తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించే కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ఇప్పటికే 36 మందిని కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏకంగా రాబోతున్న ఎన్నికలలో 175 నియోజకవర్గాల్లో దాదాపు 110 మంది టికెట్లను ఖరారు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.
 
ఇదిలావుండగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఈ నెల 16 వ తారీఖున తమ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థుల పేర్లను ఎన్నికల ప్రచారానికి ముందు ఇడుపులపాయలో ప్రకటించడానికి ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు వైసీపీ అధినేత జగన్. అయితే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు దాదాపు చాలామంది సిట్టింగ్లకే అవకాశం దక్కింది. ఇంకా 65 మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ఖరారు చేయాల్సి ఉంది. ఇదే క్రమంలో బ్యాలెన్స్ ఉన్న 60 తు అసెంబ్లీ స్థానాలను లోక్సభ స్థానాలు మరికొద్ది రోజుల్లోనే చంద్రబాబు ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినపడుతోంది.Top