చింతమనేని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు…!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ వివాదాలకు చాలా దగ్గరగా ఉంటారని ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈయన గురించి వచ్చే విషయాలు తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న క్రమంలో అభ్యర్థులను ప్రకటించడానికి రెడీగా ఉన్న చంద్రబాబు చింతమనేని పేరు ఖరారు చేసినట్లు తెగ వార్తలు వినపడుతున్నాయి.
చింతమనేని విషయంలో ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. మహిళలను కొట్టడం అక్కడ ప్రజలను కులం పేరు పెట్టి దూషించడం ఇలా చాలా రకాల అభియోగాలే అతని పై ఉన్నాయి. అయినా సరే చంద్రబాబు మాత్రం ఇంకా ఈయన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.అయితే దీనికి ఒక బలమైన కారణమే ఉందట అక్కడ నియోజకవర్గం నుంచి చింతమనేని తప్ప మరో బలమైన అభ్యర్థి ఎవరు చంద్రబాబుకి కనిపించలేదట అందుకనే చింతమనేని పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ పరంగా అక్కడ ఇతర పార్టీల అభ్యర్థులకు కూడా ధీటైన అభ్యర్థి చింతమనేనే అన్న భావనలో కూడా చంద్రబాబు ఉన్నారని అందుకే ఈ సారి ఎన్నికల్లో కూడా అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.