పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు షాక్ అవుతున్న రాజకీయవిశ్లేషకులు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ రంగంలో అడుగుపెట్టి తనకు అధికారం మీద వ్యామోహం లేదని కేవలం ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీని స్థాపించారని గతంలో అనేక ప్రసంగాలు చేశారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలలో మరియు కామెంట్లలో స్వరం మారుతోంది. తనకి కులం లేదని తనకి కులగజ్జి అంటించాలని ప్రయత్నిస్తే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కోపం చాలా వస్తుందని నేను భారతీయుడు నాకు కులం లేదు అంటూ గతంలో పేర్కొన్నారు పవన్. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఇటీవల కులాల గురించి ప్రస్తావిస్తూ చేస్తున్న కామెంట్లు చూసి కొంతమంది రాజకీయ నేతలు నోరుళ్లబెడుతున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలలోనే జనసేనకు బలం ఉందని అంటున్నారని, తాను కాపు అని అంటున్నారని కాని తనకు కులం లేదని ఆయన అన్నారు. విశాఖ మాది,శ్రీ్కాకుళం మాది ,రాయలసీమలో మాకు బలం లేదా..నేను అక్కడికి వెళ్లాను.తొడలు కొడితేనే బలమా? అది అన్నమయ్య తిరిగిన నేల అది.బ్రహ్మంగారు తిరిగిన నేల అది వాటి గురించి చెప్పరు. జనసేనకు బలం గోదావరి జిల్లాలలోనే కాదు..సమస్త ఆంద్ర ప్రదేశ్ లో ఉందని తెలంగాణ లో కూడా ఉందని ఆయన అన్నారు. యువత కోరుకున్నరోజున తెలంగాణ యువతకుకూడా జనసేన అండగా ఉంటుందని ఆయన అన్నారు. 1996లో ఇదే జిల్లా నుంచి బిజెపి నేతలు చిన్న రాష్ట్రాల అవసరం అని తీర్మానం చేశారు. ఇక్కడ నుంచి చెబుతున్నా. తెలంగాణఖు జనసేన అవసరం ఉంటుంది... తెలుగుజాతి ఐక్యత కోసం జనసేన పనిచేస్తుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. మొత్తంమీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు రాజకీయ విశ్లేషకులు షాకయ్యారు.