జగన్ కి రిటర్న్ గిఫ్ట్ కన్ఫామ్ అంటున్న టిడిపి నేత..!

Written By Xappie Desk | Updated: March 15, 2019 10:39 IST
జగన్ కి రిటర్న్ గిఫ్ట్ కన్ఫామ్ అంటున్న టిడిపి నేత..!

జగన్ కి రిటర్న్ గిఫ్ట్ కన్ఫామ్ అంటున్న టిడిపి నేత..!
 
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్..ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్టు చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సీట్ల కేటాయింపు విషయంలో కొన్ని అనివార్య కారణాల వలన వైసిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన చేరాలని నియోజకవర్గానికి చెందిన మాజీ వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎడం బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
చంద్ర‌బాబుకు కాదు రిట‌ర్న్ గిప్ట్‌… జ‌గ‌న్ ఇవ్వాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తొమ్మిదేళ్లు వైసీపీ కోసం కష్టపడి పనిచేశానన్నారు. క‌నీసీం మాట‌కూడా చెప్ప‌కుండా అమంచిని పార్టీలోకి చేర్చుకున్నార‌ని మండిప‌డ్డారు. అలాంటి ఆమంచికి చీరాలలో తప్పకుండా ఓడించి తీరాలన్నారు. ఆమంచి ఆగడాలు భరించలేకనే గతంలో తాను వైసీపీలో చేరానని గుర్తు చేసుకున్నారు బాలాజీ. చీరాల‌లో ఆమంచిని ఖచ్చితంగా ఓడిస్తామ‌ని తెలిపారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాలాజీ ఈసారి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
Top