వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన కామెంట్స్ చేసిన ఆదినారాయణ రెడ్డి..!

Written By Xappie Desk | Updated: March 16, 2019 10:03 IST
వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన కామెంట్స్ చేసిన ఆదినారాయణ రెడ్డి..!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన కామెంట్స్ చేసిన ఆదినారాయణ రెడ్డి..!
 
వైసీపీ పార్టీ అధినేత జగన్ బాబాయి వివేకానంద రెడ్డి ఇటీవల పులివెందులలో తన సొంత ఇంటిలో రక్తపు మడుగులో హత్యగా మృతదేహంగా కనబడడం ఏపీ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. కడప జిల్లాలో వైసీపీ పార్టీ కార్యకలాపాలన్నింటినీ చూసుకునే వైయస్ వివేకానంద రెడ్డిని కావాలని చంపారని వైసిపి పార్టీకి చెందిన కొంతమంది నేతలు కామెంట్ చేశారు. ఈ క్రమంలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తెలుగుదేశం పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి వైయస్ హత్య గురించి ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ గురించి వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లను ఖండించారు.
 
సిట్ ను ప్రభుత్వ అదికారులే వేస్తారని, దానిని శంకించడం సరికాదని ఆయన అన్నారు. టిడిపి నేతలపై ఆరోపణలు చేయడం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అలవాటు అయిందని అన్నారు. వివేకా మృతి బాదాకరమని, లోతుగా దర్యాప్తు చేయాలని అంటూ తప్పు చేసిన వారిన ఉరి తీయాలని అన్నారు. అయితే దీనిని తమకు ఆపాదించాలని ఆరోపిస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. గతంలో వైఎస్ జగన్ పై దాడి జరిగినప్పుడు కూడా ఇలాగే ఆరోపణలు చేశారని అన్నారు. కాగా వైఎస్ కుటుంబంలోనే విబేదాలు ఉన్నాయని మంత్రి ఆదినారాయణరెడ్డి ఎదురుదాడి చేశారు. అవినాష్ రెడ్డి, వివేకా మంద్య గొడవలు ఉన్నాయని కూడా ఆయన ఆరోపించారు. దీంతో వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఈ కామెంట్లని విని వాళ్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే..సీబీఐ విచారణకు మీరు ఎందుకు భయపడుతున్నారో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Top