వైయస్ వివేకానంద రెడ్డి పోస్టుమార్టంలో బయటపడ్డ షాకింగ్ విషయాలు..!

Written By Xappie Desk | Updated: March 16, 2019 10:12 IST
వైయస్ వివేకానంద రెడ్డి పోస్టుమార్టంలో బయటపడ్డ షాకింగ్ విషయాలు..!

వైయస్ వివేకానంద రెడ్డి పోస్టుమార్టంలో బయటపడ్డ షాకింగ్ విషయాలు..!
 
వైసీపీ పార్టీ కి చెందిన వైయస్ వివేకానంద రెడ్డి అనుమానస్పదంగా మరణించడంతో..ఆయన మృతదేహాన్ని పులివెందల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పోస్ట్ మార్టం లో బయటపడ్డ విషయాలు వైసీపీ నేతలను మరియు కడప ప్రజలను ఎంతగానో కలచివేశాయ. తాజాగా బయటకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో వైయస్ వివేకానంద రెడ్డిని హత్యేనని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కూడా హ‌త్య అని తేలింది.
 
వివేకానంద రెడ్డి శ‌రీరం పై 7 క‌త్తిపోట్లు ఉన్నాయ‌ని, పదునైన ఆయుధంతో శరీరంపై దాడి చేసినట్లు వైద్యులు త‌మ నివేదిక‌లో వెల్ల‌డించారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ క్ర‌మంలో దీనికి స‌బంధించి క‌ర్నూలు నుండి ఫోరెన్సిక్ నిపుణులు పులివెందుల‌కు రానుండ‌గా, ఈ కేసుకు సంబంధించి మ‌రి కొన్ని కీల‌క ఆధారాలు దొరికిన‌ట్లు పోలీసులు వెళ్ళ‌డించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు, అధికారులు మాత్రం వివేకానంద‌రెడ్డిది హ‌త్యే అని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇక వివేకానంద‌రెడ్డి నివాసం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో మంచి వ్యక్తిత్వం కలిగిన ప్రజానేతను కోల్పోయామంటూ స‌ర్వ‌త్రా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Top