బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన కామెంట్స్ చేసిన జగన్..!

Written By Xappie Desk | Updated: March 16, 2019 10:20 IST
బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన కామెంట్స్ చేసిన జగన్..!

బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన కామెంట్స్ చేసిన జగన్..!
 
బాబాయ్ వివేకానంద రెడ్డి మృతదేహాన్ని చూసి చలించిపోయారు వైసీపీ అధినేత జగన్ . వివేకానంద రెడ్డి మృతదేహం దగ్గరికి జగన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పులివెందుల ప్రజలు వైసీపీ పార్టీ కార్యకర్తలు నేతలు ఒక్కసారిగా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో వైయస్ వివేకానంద రెడ్డి మృతదేహాన్ని చూసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ సంచలన కామెంట్లు చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై. రాజకీయంగా ఇది అత్యంత నీచమైన చర్య ఈ హత్య అని ఆయన అన్నారు. ముప్పై ఏళ్లుగా రాజకీయంలో ఉన్న వ్యక్తిని ఆయన ఇంటిలోకి చొరబడి గొడ్డళ్లతో నరికి చంపడం దారుణం అని ఆయన అన్నారు ఆయన చరిత్ర చూస్తే ఎంతో సౌమ్యుడు అని అంతా చెప్పుకుంటారు.
 
బాధ ఏమిటంటే దర్యాప్తు జరుగుతున్న తీరు. చనిపోతూ వివేకానందరెడ్డి ఒక లేఖ రాశారని పోలీసులు చూపుతున్నారని ఆయన అన్నారు. తల మీద ఐదుసార్లుగొడ్డలితో నరికారు. ఆ తర్వాత బాత్ రూమ్ లోకి వెళ్లి రక్తం పోయి మూర్చ తో మరణించారని పాబ్రికేట్ చేస్తున్నారు. ఒకరు కాదు. నలుగురు వ్యక్తులు చిన్నాన్నను బాత్ రూమ్ కు ఎత్తుకు వెళ్లారు. అక్కడ కమ్ అవుట్ కు రక్తం పూశారు, తద్వారా ఆయన పడిపోయారని చూపించడానికి ప్రయత్నం చేశారన్నమాట. చిన్నాన్న అలాంటి పరిస్థితి లో ఉత్తరం రాస్తారా? హంతకుల సమక్షంలో లేఖ రాస్తారా?రాస్తుంటే హంతకులు చూస్తూ కూర్చుంటారా? ఒక డ్రైవర్ ను ఇరికించి కేసును పక్కదారి పెడుతున్నారు అని ఆయన అన్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు దారుణంగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ తాత రాజారెడ్డి ని హత్య చేస్తే అప్పుడు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి అని ఆయన గుర్తు చేశారు. తాతను చంపితే రాజశేఖరరెడ్డిని కట్టడి చేయవచ్చని భావించారు. ఆ తర్వాత తన తండ్రి హత్యకు గురయ్యారు. అప్పుడు విచారణ చేసింది ఇదే సిబిఐ లక్ష్మీనారాయణ. తదుపరి తనపై హత్యాయత్నం జరిగింది. తెలుగుదేశంతో సంబందం ఉన్న వ్యక్తి హత్యాయత్నం చేస్తే చంద్రబాబు ఎలా మాట్లాడారో చూశాం. ఇప్పుడు బాబాయి వివేకానందరెడ్డి హత్యకు గురి అయితే ఇప్పుడు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి గా ఉన్నారు. అన్నిటిలో కుట్రకోణమే….అంటూ జగన్ సంచలన కామెంట్ చేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు మరియు నాయకులు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వాటిని చేసే రాజకీయ నేతలకు...దేవుడు మరియు రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని దేవుడిపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.
Top