వైయస్ వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో అందరి అనుమానం అతనిపైనే..!

Written By Xappie Desk | Updated: March 16, 2019 10:27 IST
వైయస్ వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో అందరి అనుమానం అతనిపైనే..!

వైయస్ వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో అందరి అనుమానం అతనిపైనే..!
 
కడప జిల్లాలో వైయస్ కుటుంబానికి ఎదురు లేదని అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో కడప జిల్లాలో అధికార పార్టీ తెలుగుదేశం జండా ఎగరవేయడం కావాలని వైసీపీ అధినేత జగన్ బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని టిడిపి నేతలు హతమార్చారని వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు కామెంట్లు చేస్తుంటే మరికొంతమంది ఈ హత్య వెనుక సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హస్తం ఉందని వై.యస్ కుటుంబ సభ్యులు తమ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
విషయం ఏమిటంటే..సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి గ‌తంలో వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసులో నిందితులుగా ఉన్న 13 మందిలో సుధాక‌ర్ రెడ్డి కూడా 8వ నిందితుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. ఉమ్మ‌డి హైకోర్టు 2006లో వీరికి జీవిత ఖైదు వేసింది. అయితే తాజాగా స‌త్ప్ర‌వ‌ర్త‌న కింద సుధాక‌ర్ ఎడ్డి మూడు నెల‌లు క్రిత‌మే క‌డ‌ప జైలు నుండి విడుద‌ల అయ్యాడు. అయితే ఇప్పుడు వివేకానంద‌రెడ్డి హ‌త్య‌తో కూడా సుధాక‌ర్ రెడ్డికి సంబంధం ఉందా అనే అనుమానాల‌ను వివేకా వ‌ర్గీయులు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక పోలీసుల అనుమానం కూడా ప్ర‌స్తుతం సుధాక‌ర్ రెడ్డి పైనే ఉంది. దీంతో సుధాక‌ర్ రెడ్డి కోసం ప్ర‌త్యేక బృందాలు రంగంలోకి దిగాయ‌ని స‌మాచారం. మ‌రి వివేక‌నంద రెడ్డి హత్య కేసులో ముందు ముందు ఎవ‌రెవ‌రి పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి.
Top