వైయస్ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: March 16, 2019 10:31 IST
వైయస్ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు..!

వైయస్ వివేకానంద రెడ్డి మర్డర్ గురించి స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు..!
 
వైయస్ వివేకానంద రెడ్డి మరణ వార్త విని నాకు చాలా బాధ వేసింది అని పేర్కొన్నారు టిడిపి అధినేత చంద్రబాబు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి మరణ వార్త గురించి నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేతల పై మరియు వైయస్ కుటుంబ సభ్యులపై సంచలన కామెంట్ చేశారు చంద్రబాబు. వైసిపి పార్టీకి చెందిన కొంతమంది నాయకులు వైయస్ వివేకానంద రెడ్డి హత్య తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అంటూ చంద్రబాబు ఆరోపించారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ...‘‘మొదట వివేకా గుండెపోటుతో చనిపోయారని, తరువాత ఎవరో వెనక తలుపులు తీసుకోని లోపలికి వెళ్లారని చెప్పారు. అంటే సాధారణ మరణం నుండి హత్య వరకు మార్చారు. కాగా ఘటనాస్థలం వద్దకు సాధారణంగా ఎవరూ వెళ్లకూడదు. కానీ బెడ్‌రూమ్‌లో తలకు గాయమైందని గుడ్డ కట్టారు. సీఐ వెళ్లేలోపు రక్తం కూడా కడిగేశారు. వివేకా శరీరంపై బలమైన గాయాలున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు విషయం ఎందుకు దాచారు? మృతదేహం చూసిన ఎవరికైనా హత్య అని తెలుస్తుంది. అసలు బెడ్‌రూమ్‌ ఎందుకు శుభ్రం చేశారు. ఇంట్లో హత్య జరిగితే... అది తెలుగుదేశం పార్టీపై రుద్దటం సమంజసం కాదని వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లను తీవ్రంగా ఖండించారు.
Top