కెసిఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!

By Xappie Desk, March 17, 2019 10:46 IST

కెసిఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ..పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టిడిపి కార్యకర్తలు మరియు తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. షెడ్యూల్ 9,10 లలోని సంస్థల విభజన జరగలేదని, ఆస్తులలో ఎపికి రావల్సిన వాటా ఇవ్వలేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టులో కెసిఆర్ కు ఏమి పని అని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబందించి కేంద్రం నాలుగువేల కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉందని, అయినా తాము పనులు చేస్తున్నామని ఆయన అన్నారు. జూలైలో పోలవరం నీటిని గ్రావిటీపై ఇస్తామని, విశాఖపట్నానికి నీరు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానికి డబ్బులు ఇస్తామని అన్నారని, హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో, అప్పులతో వచ్చామని...కేంద్రం కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని … మోడీ మట్టి, నీరుకొట్టి మోసం చేసిన వ్యక్తి మోడీ అని చంద్రబాబు అన్నారు. అయినా ఎట్టిపరిస్థితిలో అమరావతి కట్టాలని ముందుకు వెళ్లామని రాబోయే రోజుల్లో అమరావతిని పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు చాలా గట్టిగా బహిరంగ సభలో మాట్లాడారు.Top