టీడీపీకి భారీ షాక్ మరో ఎమ్మెల్యే రాజీనామా ..!

Written By Xappie Desk | Updated: March 17, 2019 10:53 IST
టీడీపీకి భారీ షాక్ మరో ఎమ్మెల్యే రాజీనామా ..!

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ముఖచిత్రం రోజుకో విధంగా మారిపోతుంది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మరియు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ పార్టీకి చెందిన నాయకులు ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ ఇస్తున్న ట్విస్టులు..ఆంధ్ర రాజకీయాన్ని రసవత్తరంగా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి జోరు మీదున్న వైసీపీ పార్టీ కి ఇతర పార్టీల నుండి చాలామంది నాయకులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే...తాజాగా చంద్రబాబు విడుదల చేసిన అభ్యర్థుల లిస్టులో తన పేరు లేకపోవడంతో కృష్ణాజిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి… వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబుపై 13,505 మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈసారి ఎన్నిక‌ల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ నేలపూడి స్టాలిన్‌బాబుకు ఇవ్వడంతో అసంతృప్తికి లోనైన ఆయన రాజీనామా చేసి బాబుకు షాక్ ఇచ్చారు. తనను కాదని టికెట్‌ ఇచ్చిన నేలపూడి స్టాలిన్ బాబుని ఓడించడమే తన టార్గెట్ అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు పులపర్తి నారాయణమూర్తి.
Top