నా చిన్నాన్న చేసిన పాపం ఇదేనా... జగన్ ఆవేదనకరమైన మాటలు..!

Written By Xappie Desk | Updated: March 17, 2019 11:09 IST
నా చిన్నాన్న చేసిన పాపం ఇదేనా... జగన్ ఆవేదనకరమైన మాటలు..!

కడప జిల్లాలో వైసీపీ పార్టీ కార్యకలాపాలను దగ్గరుండి చూసుకుంటూ అధికార పార్టీ టీడీపీ కి చుక్కలు చూపించిన వైసీపీ పార్టీ అధినేత జగన్ బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి... ఇటీవల హత్యకు గురవడంతో కడప జిల్లాలో విషాద వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తన బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని దారుణంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చంపారని వైసీపీ పార్టీ అధినేత జగన్ ఇటీవల ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఇదే విషయమై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ని కలిసి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు చేతిలో ఉన్నవారితో విచారణ జరిగితే ఎలా న్యాయం జరుగుతుందని గవర్నర్ ను ప్రశ్నించామని ఆయన అన్నారు. తాము ఎస్పితో మాట్లాడుతుండగానే ఆయనకు ఇంటిలెజెన్స్ అదనపు డిజి ఎబి వెంకటేశ్వరరావు పోన్ చేయడం గమనించామని, దానిని బట్టి ఎలా మోనిటర్ చేస్తున్నది అర్దం అయిందని, ఇదే వెంకటేశ్వరరావు టిడిపికి గ్రామాలలో ఎలా ఓట్లు పెంచాలన్నదానిపై చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు పోలీసులను తన వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఇరవైమూడు మంది వైసిపి ఎమ్మెల్యేలను 20 - 30 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసే ప్రక్రియలో ఎబి వెంకటేశ్వరరావు, ఆంద్రజ్యోతి ఎమ్.డి. రాదాకృష్ణ భాగస్వాములని ఆయన అన్నారు. వివేకా కేవలం జమ్మలమడుగు ఇన్ చార్జీగా ఉండి వైసిపి తరపున పనిచేస్తున్నారని, అదే ఆయన తప్పా, జమ్మలమడుగు ఇన్ చార్జీగా ఉండడమే వివేకా చేసిన పాపమా? అని జగన్ అన్నారు. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలను ఎదుర్కోవడానికి తమ పార్టీ తరపున యువకుడు సుధీర్ రెడ్డి పోటీచేస్తుంటే,అతనికి అండగా వివేకా ఉండడమే పాపమా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేయకపోతే సిబిఐ విచారణకు ఎందుకు ఒప్పుకోవడం లేదని, ఇది తాను సూటిగా వేస్తున్న ప్రశ్న అని జగన్ అన్నారు. ఇంటిలో ఒంటరిగా ఉన్నాడని తెలుసుకొని రెక్కీ నిర్వహించి చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా వివేకానంద రెడ్డి ని హతమార్చారని... ఆవేదన వ్యక్తం చేశారు జగన్. ఇంత రాక్షసత్వం గా ప్రవర్తిస్తుంటే పైనున్న దేవుడు కూడా ఊరుకోడని... చంద్రబాబు మూల్యం చెల్లించుకునే రోజులు కూడా ఉంటాయని జగన్ అన్నారు.
Top