నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటు లోనే ఉంటా: నారా లోకేష్..!

Written By Xappie Desk | Updated: March 17, 2019 11:12 IST
నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటు లోనే ఉంటా: నారా లోకేష్..!

గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి ఎమ్మెల్సీ పదవి దక్కించుకునే మంత్రి పదవి చేపట్టిన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్... రాబోతున్న ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ రాబోతున్న ఎన్నికల గురించి మరియు ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం గురించి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో మంగళగిరి ప్రజలకు మరియు..కార్యకర్తలకు, తానెప్పుడూ అందుబాటులో ఉంటానని... తన వద్ద ఎటువంటి పిఎ వ్యవస్థ లేదని, అందరి ఫోన్‌ కాల్స్‌కి, మెసేజ్‌లకు తానే స్వయంగా సమాధానం ఇస్తానని తెలిపారు. కొందరు కులం, మతం, ప్రాంతం ప్రస్తావన తీసుకొస్తున్నారని విమర్శించారు. మన కులం, మతం, ప్రాంతం అన్నీ మంగళగిరేనని పేర్కొన్నారు. పార్లమెంటులో ఎవరైనా మోదీ పేరు పలకాలంటేనే భయపడతారని, అలాంటిది టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ లోక్‌సభలో మిస్టర్‌ ప్రైమినిస్టర్‌ అంటూ ధైర్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. మచ్చలేని కుటుంబాలపై కక్షపూరితంగా కావాలనే కేసులు పెడుతున్నారని లోకేష్‌ ఆరోపించారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
Top